నీ అయ్యనే ఉరికించా... నువ్వెంత లోకేష్: జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Published : Aug 25, 2023, 05:29 PM ISTUpdated : Aug 25, 2023, 05:32 PM IST
నీ అయ్యనే ఉరికించా... నువ్వెంత లోకేష్: జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్

సారాంశం

టిడిపి నాయకుడు నాారా లోకేష్ పై మంత్రి జోగి రమేష్ సీరియస్ అయ్యారు. జనసేన చీఫ్ పవన్, టిడిపి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లకు కూడా మంత్రి సవాల్ విసిరారు. 

విజయవాడ :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్న నారా లోకేష్ కు మంత్రి జోగి రమేష్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని... మాటలు అదుపులో పెట్టుకోవాలని మంత్రి హెచ్చరించారు. నీ అయ్యనే ఉరికించాం... నువ్వెంత లోకేష్ అంటూ జోగి రమేష్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రి జోగి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు పార్ధసారధి, కైలే అనిల్ కుమార్,సింహాద్రి రమేష్ బాబు,వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, జేసీలు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ టిడిపి నాయకులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల, వైసిపి నాయకులపై కుక్కలు మొరిగినట్లు టీడిపి నేతలు మొరుగుతున్నారని అన్నారు. కర్రలు తీసుకుని వెంటపడితే టిడిపి నేతలంతా కుక్కల్లా పారిపోతారని హెచ్చరించారు. మీ ఇంటికి కూడా వచ్చా లోకేష్... మీ నాన్న తోకముడుచుకుని పారిపోయిన విషయం మరిచావా అంటూ మంత్రి ఎద్దేవా చేసారు. 

Read More  ఇసుకాసురుడు @ 40వేల కోట్ల దోపిడీ.. జగన్‌కు పది ప్రశ్నలు, 48 గంటల్లో సమాధానం చెప్పాలి : చంద్రబాబు

కేవలం సీఎం జగన్ ని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని జోగి రమేష్ మండిపడ్డారు. గన్నవరం సభ ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందన్నారు. పాదయాత్ర అంటే ఎంటో వైఎస్సాఆర్, వైఎస్ జగన్ లను చూసి నేర్చుకోవాలంటూ లోకేష్ కు సూచించారు. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారు... కానీ లోకేష్ బౌన్సర్లను పెట్టుకొని ఎవ్వరినీ దగ్గరకు రానివ్వకుండా పాదయాత్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.  పాదయాత్రలకు పేటెంట్ వైఎస్సార్ కుటుంబానికే వుందని జోగి రమేష్ అన్నారు. 

ఇక జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పైనా మంత్రి సీరియస్ అయ్యారు. నేను చంద్రబాబు ఇంటికే వెళ్లాను... నువ్వు సిద్దమంటే నీ దగ్గరకూ వస్తానని హెచ్చరించారు. నువ్వే టైం, ప్లేస్ చెప్పు... నీ దగ్గరకు వస్తానని హెచ్చరించారు. వారాహి యాత్ర, పాదయాత్ర చేసిన జనసేన, టిడిపిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దమ్ముంటే పవణ్ కళ్యాణ్ భీమవరంలో, చంద్రబాబు కుప్పంలో ఒంటరిగా పోటీ చేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu