‘‘ సూసైడ్ బ్యాచ్ ’’ ఆలోచన చంద్రబాబుదే.. నన్నే కొట్టించారు: బుద్దా వెంకన్న వ్యాఖ్యలకు జోగి రమేశ్ కౌంటర్

Siva Kodati |  
Published : Apr 20, 2022, 03:46 PM IST
‘‘ సూసైడ్ బ్యాచ్ ’’ ఆలోచన చంద్రబాబుదే.. నన్నే కొట్టించారు: బుద్దా వెంకన్న వ్యాఖ్యలకు జోగి రమేశ్ కౌంటర్

సారాంశం

వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి జోగి రమేష్. న్యాయం కోసం వెళ్లిన తననే అప్పట్లో కొట్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబే సూసైడ్ బ్యాచ్‌ను తయారు చేశారని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.   

చంద్రబాబుని టచ్ చేస్తే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత, మంత్రి జోగి రమేష్ కౌంటరిచ్చారు. చంద్రబాబే సూసైడ్ బ్యాచ్‌ను తయారు చేసి వదిలారని రమేష్ వ్యాఖ్యానించారు. మేం వాళ్లని టచ్ చేయాల్సిన అవసరం లేదని.. జనమే ఓట్లతో సమాధానం చెప్పారని మంత్రి అన్నారు. న్యాయం కోసం వెళ్లిన తననే అప్పట్లో కొట్టించారని జోగి రమేష్ ఆరోపించారు. 

అంతకుముందు బుధవారం నాడు Buddha Venkanna మీడియాతో మాట్లాడుతూ.. Chandrababu Naiduపై చెత్తవాగుడు మానుకోవాలని సూచించారు. 100 మందితో Suicide బ్యాచ్ తయారు చేశామన్నారు. చంపడానికైనా చావడానికైనా సిద్దమేనన్నారు. చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు మానుకోవాలని బుద్దా వెంకన్న YCP నేతలకు సూచించారు. అంతేకాదు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా కోరారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు.

ఆయనను తిడితే TDP ఆఫీస్ పై దాడి చేస్తే పదవులు వస్తాయనే భ్రమల నుండి వైసీపీ నేతలు బయటకు రావాలని హితవు పలికారు. సీనియర్లను కాదని జోగి  రమేష్ కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాల్సిందేనని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే