చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్: చిరంజీవి, పవన్‌ కల్యాణ్ కూడా..

Published : Apr 20, 2022, 03:39 PM ISTUpdated : Apr 20, 2022, 03:44 PM IST
చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్: చిరంజీవి, పవన్‌ కల్యాణ్ కూడా..

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం 73వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు, పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం 73వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు, పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ విషెస్ చెప్పారు. ‘‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు గారు’’ అని జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఏపీ  బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

 

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని,  అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. గతంలో చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అన్న అంటూ ట్వీట్ చేశారు. 

ఇక, చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్బంగా బుధవారం ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు.. అమ్మవారి చిత్ర పటం, తీర్ధ ప్రసాదాలను చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబుతో పాటు దుర్గమ్మను దర్శించుకున్నవారిలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు బుద్ద వెంకన్న కూడా ఉన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే