ఎక్కడికి రమ్మంటారో చెప్పండి : పవన్, చంద్రబాబులకు జోగి రమేష్ సవాల్

Siva Kodati |  
Published : Nov 09, 2022, 08:09 PM IST
ఎక్కడికి రమ్మంటారో చెప్పండి : పవన్, చంద్రబాబులకు జోగి రమేష్ సవాల్

సారాంశం

జగనన్న కాలనీల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదన్నారు మంత్రి జోగి రమేశ్.  జనసేన, టీడీపీలు టైం చెబితే.. తానే చర్చకు వస్తానని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లకు ఆయన సవాల్ విసిరారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదన్నారు. దమ్ముంటే జనసేన, టీడీపీలు టైం చెబితే.. తానే చర్చకు వస్తానని జోగి రమేశ్ సవాల్ విసిరారు. ఏ జగనన్న కాలనీకి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. ఇప్పటంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని.. రోడ్డు విస్తరణకు అడ్డొచ్చిన ప్రహరీ గోడలనే తొలగించారని మంత్రి పేర్కొన్నారు. పవన్ విలనిజం, హీరోయిజం ప్రజాస్వామ్యంలో పనికిరాదని జోగి రమేశ్ దుయ్యబట్టారు. 

ఇకపోతే.. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై నవంబర్ 4న మంత్రి జోగి రమేశ్ స్పందించారు. రోడ్ షోలో పడ్డ రాయిని చంద్రబాబే విసిరించుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని.. రాళ్ల దాడి ఘటన దీనిలో భాగంగానే జరగిందని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడటం బాధాకరమని ... బాధితుడైన అధికారికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబేనని మంత్రి పేర్కొన్నారు. 

Also Read:శత్రువులైనా క్షేమం కోరుకుంటాం, మాకేం అవసరం : పవన్ హత్యకు కుట్రపై జోగి రమేశ్ స్పందన

వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం తరపున అభ్యర్ధులను దించే ధైర్యం చంద్రబాబుకు వుందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. అటు తాను సీఎం అభ్యర్ధినని చెప్పే దమ్ము జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వుందా అని మంత్రి నిలదీశారు. పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అది సాధ్యం కాదని జోగి రమేశ్ జోస్యం చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu
పోలవరం, అమరావతి మాటల్లోనే.. చేతల్లో శూన్యంPerni Nani Slams Alliance Government | Asianet News Telugu