నైరుతి బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

By Sumanth KanukulaFirst Published Nov 9, 2022, 5:25 PM IST
Highlights

నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ఈనెల 12 లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం చేరుకునే అవకాశముందని తెలిపింది. 

ఇక, బుధవారం నాడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 12 వరకు కూడా  భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం నగరంలో కూడా నవంబర్ 11, 12 తేదీలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

click me!