రోజా ఓ శూర్పణక.....మంత్రి జవహర్

Published : Aug 13, 2018, 03:49 PM ISTUpdated : Sep 09, 2018, 10:52 AM IST
రోజా ఓ శూర్పణక.....మంత్రి జవహర్

సారాంశం

  అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి జవహర్ సంచనల వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో రోజా శూర్పణక పాత్ర పోషిస్తున్నారని, రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కష్టాలు పాలవడం మాములేనని, ఉన్న పార్టీని నాశనం చెయ్యడం రోజాకి అలవాటేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి జవహర్ సంచనల వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో రోజా శూర్పణక పాత్ర పోషిస్తున్నారని, రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కష్టాలు పాలవడం మాములేనని, ఉన్న పార్టీని నాశనం చెయ్యడం రోజాకి అలవాటేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా నోటి దురుసు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడుపై రోజా చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి జవహర్ డిమాండ్ చేశారు.  

మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డికి ఈడీ కేసుల వ్యవహారం  సీఎం చంద్రబాబుకి సంబంధమేంటని ప్రశ్నించారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుండి బయటకు వస్తే కేసుల నుంచి బయటపడేందుకు జగన్ బీజేపీతో కుమక్కయ్యారని ఆరోపించారు.

 అటు జనసేన అధినేత  పవన్ కళ్యాణ్‌ని పట్టించుకునే తీరిక తమకు లేదన్న మంత్రి జవర్ పవన్ అంటే గాలి ఆ గాలి మాటలను ప్రజలు నమ్మరని కొట్టిపారేశారు.  తన సామాజికవర్గంలో పవన్ కళ్యాణ్ కంటే తానే గొప్ప నాయకుడినంటూ చెప్పుకొచ్చారు జవహర్.  


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే