మెడికో గీతిక ఆత్మహత్య: తను లేకుండా బతకలేనమ్మా...

Published : Aug 13, 2018, 03:18 PM ISTUpdated : Sep 09, 2018, 11:31 AM IST
మెడికో గీతిక ఆత్మహత్య: తను లేకుండా బతకలేనమ్మా...

సారాంశం

ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థిని శిల్ప ఆత్మహత్య రగడ సద్దుమణగక ముందే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్:  ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థిని శిల్ప ఆత్మహత్య రగడ సద్దుమణగక ముందే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గీతిక అనే వైద్య విద్యార్థిని ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

ప్రేమ వ్యవహారంతోనే గీతిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారమే పోలీసులు అనుమానించారు. సూసైడ్ నోట్ లో "తను లేకుండా నేను బతలేను అమ్మా" అని గీతిక రాసింది. దీంతో పోలీసుల అనుమానమే నిజమని తేలింది. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ పాఠం ఈ కింద చదవండి

అమ్మా,

నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు. ఎందుకో అమ్మా ఇక నాకు బతకాలని లేదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదమ్మా. అందరి గురించి ఆలోచించి, అందరు అమ్మాయిల్లాగా నాకూ భర్త, కుటుంబం.. అతని ప్రేమ కావాలనుకున్నా. కానీ, నా జీవితంలో నేను ఓడిపోయానమ్మా. తను లేకుండా నేను బతకలేను. కనీసం నా జీవితం కోసమైనా తనను ఏమీ చేయకమ్మా. నన్ను క్షమించు అమ్మా. నేను పిరికిదాన్ని కాదమ్మా. కానీ, నాకు వేరే దారి కనిపించలేదు. తను లేకుండా బతకలేను. అలా అని తనతో కలిసి బతకలేను. అందుకని వెళ్లిపోతున్నాను.

నన్ను క్షమించండి

ఇట్లు
పి. గీతిక

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు