సర్పవరంలో రియాక్టర్ పేలుడు: ఆరా తీసిన మంత్రి గుమ్మనూరు

By Siva KodatiFirst Published Mar 11, 2021, 10:16 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో టైకి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టరు పేలిన ఘటనపై స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్. ఈ విషయంపై జిల్లా మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి గుమ్మనూరు

తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో టైకి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టరు పేలిన ఘటనపై స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్. ఈ విషయంపై జిల్లా మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి గుమ్మనూరు.

సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇద్దరు కార్మికులు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు గాయాలు అవ్వడంతో వారికి ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని గుమ్మనూరు అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని జయరామ్ ఆదేశించారు.

ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారుకులైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

కాగా, గురువారం సర్పవరం టైకీ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం నాడు బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు

click me!