కోవిడ్ టీకా వేయించుకున్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

By Siva Kodati  |  First Published Mar 11, 2021, 8:30 PM IST

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన టీకా వేయించుకున్నారు. అనంతరం గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసం తమ ప్రాణాల కంటే ప్రజాసామ్య పరిరక్షణే ద్యేయంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పోలీసులు వాయిదా వేసుకున్నారని తెలిపారు.

పంచాయితీ ఎన్నికల అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల మధ్య  స్వల్ప సమయంలో మొదటి డోస్ వాక్సినేషన్ 90% శాతం మందికి  పూర్తి చేశామని డీజీపీ వెల్లడించారు. వ్యాక్సినేషన్ వేసుకొని నగర, పురపాలక ఎన్నికల్లో పోలీసులు విధులు నిర్వర్తించారని గౌతం సవాంగ్ పేర్కొన్నారు.

Latest Videos

ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో పోలీస్ క్లినిక్‌లో వ్యాక్సిన్ తీసుకున్నట్లు డీజీపీ చెప్పారు. మిగిలిన సిబ్బంది వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు.

ప్రజలు వ్యాక్సిన్ పై అపోహలు విడనాడి, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని డీజీపీ సూచించారు. భారతదేశం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ప్రజలకు వ్యాక్సినేషన్‌ని అందుబాటులోకి తీసుకురావడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. 

click me!