జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు.. నేను ఆయన సైనికుడిని : గుడివాడ అమర్నాథ్

Published : Feb 16, 2024, 09:07 AM ISTUpdated : Feb 16, 2024, 09:11 AM IST
జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు.. నేను ఆయన సైనికుడిని : గుడివాడ అమర్నాథ్

సారాంశం

జగన్ సీట్లో అమర్నాథ్ రెడ్డి కూర్చున్నారని టీడీపీ నేతలు, ధూళిపాళ్ల నరేంద్ర చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అమర్నాథ్ రెడ్డి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల మధ్య వాడి వేడి మాటలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకు వస్తే చంద్రముఖిని తెచ్చుకున్నట్లే అంటూ ముఖ్య మంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు..  తమ కార్యకర్తలు కుర్చీని మడత పెట్టి ఇంటికి పంపిస్తారు అంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. పార్టీ అధ్యక్షులు ఇలా కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటుంటే.. మంత్రులు కూడా తామూ తగ్గేదేలే అన్నట్టుగా మాటల తూటాలు పేలుస్తున్నారు.

టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై మంత్రి అమర్నాథ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు లాగా కుర్చీలు లాక్కునే లక్షణం తనది కాదని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తన మామ కుర్చీని లాక్కున్నారని, ఎన్టీఆర్ ట్రస్ట్ లాక్కున్నారని విమర్శించారు. తాను కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహించే రూమ్ లో మాత్రమే కూర్చున్నానని.. జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోలేదని ఘాటుగా స్పందించారు. టిడిపి నేతలు తెలివితక్కువ  దద్దమ్మలని ఎద్దేవా చేశారు.

విజయవాడలో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదే కేశినేని నాని : బుద్దా వెంకన్న సంచలనం

బాలకృష్ణ అసెంబ్లీలో చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారని ఆ సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. తామంతా జగనన్న సైనికులమని చెప్పుకొచ్చారు. గ్రామ వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమని.. వారికీ  వైసీపీకి సంబంధం లేదన్నారు. తాను జగన్ దగ్గర పనిచేసే సైనికుడి మాత్రమేనని జగన్ అనుకుంటే ఎవరినైనా, ఎక్కడైనా కూర్చోబెడతారని చెప్పారు. తన తలరాత రాసేది జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందరి తలలు భగవంతుడు రాస్తే నా తలరాత జగనన్న రాస్తారన్నారు.  అమర్నాథ్గా నేను పోటీ చేసిన చెయ్యకపోయినా వైసీపీ జెండా పట్టుకుని పనిచేస్తానని..  ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ గెలుపే లక్ష్యమన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తేనే గుర్తింపు వస్తుందనేది అమాయకత్వం అని తెలిపారు.  

రూ. 5 వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్ విధానంలో చేసే క్రమంలో మంత్రి అమర్నాథ్ సెక్రటేరియట్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలు అమర్నాథ్ తీసుకున్నారు. ఈ క్రమంలో జగన్ సీట్లో అమర్నాథ్ రెడ్డి కూర్చున్నారని టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్రకు ఈ మేరకు అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే