రుషికొండ బీచ్‌లో ప్రవేశ రుసుము.. ఆ వార్తల్లో నిజం లేదన్న మంత్రి అమర్‌నాథ్..

Published : Jul 09, 2023, 04:56 PM IST
రుషికొండ బీచ్‌లో ప్రవేశ రుసుము.. ఆ వార్తల్లో నిజం లేదన్న మంత్రి అమర్‌నాథ్..

సారాంశం

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుము వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. 

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుము వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రుషికొండ బీచ్ సందర్శనకు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రుషికొండ బీచ్‌కు బ్లూ స్టార్ హోదా లభించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. బీచ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. అయితే రుషికొండ చీచ్‌లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని.. బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. బీచ్‌‌లో ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన పర్యాటకులకు, నగరవాసులను కోరారు. 

ఇక, జూలై 11 నుంచి రుషికొండ బీచ్‌లో సందర్శకుల నుంచి రూ. 20 ప్రవేశ రుసుము వసూలు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. దేశంలో ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ పొందిన 12 బీచ్‌లలో రుషికొండ ఒకటని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. అయితే 10 ఏళ్ల లోపు పిల్లలకు ఎలాంటి ప్రవేశ రుసుము  వసూలు చేయబోమని చెప్పారు. ఇది పర్యాటకులకు వివిధ సౌకర్యాలను అందించడానికి అధికారులకు సహాయపడుతుందని.. స్విమ్మింగ్ జోన్, జిమ్ పరికరాలు, ఇతర సౌకర్యాలు ఎటువంటి ఛార్జీలు లేకుండా అందించబడతాయని పేర్కొన్నారు. 

అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాల సభ్యులు ఖండించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం ఫీజు ఎలా పెడుతుందని సభ్యులు ప్రశ్నించారు. ఈ నిర్ణయంపై టీడీపీ గంటా శ్రీనివాసరావు శనివారం సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం సహజమైన బీచ్‌లకు కేంద్రంగా ఉందని.. నగరవాసులు విశ్రాంతి కోసం ప్రతిరోజూ బీచ్‌లకు వెళతారని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎంట్రీ ఛార్జీలు వసూలు చేయడానికి ప్రయత్నిస్తోందని.. ఇది పూర్తిగా అన్యాయమని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే బీచ్‌లో ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!