చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారాలోకేష్ లపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

Published : Aug 17, 2022, 05:29 PM IST
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారాలోకేష్ లపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

సారాంశం

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారాలోకేష్ లపై విరుచుకుపడ్డారు. 

అమరావతి :  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి హయాంలో పెట్టుబడులన్నీ కేవలం నోటి మాటలే అని అన్నారు. ‘మీరు మాట్లాడితేనే.. ఇండస్ట్రీలు వచ్చేస్తాయా?..  ఎవరెవరికో సూటు బూటు వేసి ఎంవోయులు చేసిన ఘనత బాబుదే.  జపాన్ ప్రతినిధులు చెప్పింది విదేశాల్లో చదివిన లోకేష్ బుర్రకు అర్థం కాలేదా?  ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్  రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకువచ్చారు?  లోకేష్ చెప్పే  కుంభకోణం.. మంగళవారం సామెత ఉంది. 

జగన్ మంచి కోరితే..బాబు చావు కోరే రకం. రాష్ట్రాన్ని సీఎం జగన్ పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తున్నారు. బ్రాహ్మణితో తగువులు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి. భారతమ్మను రాజకీయాల్లోకి లాగి బ్రాహ్మణిని తిట్టించాలన్నదే లోకేష్ ఉద్దేశమా? లోకేష్ లా బీచ్ లో, స్విమ్మింగ్ పూల్ చదువులు జగన్ చదవలేదు. వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని లోకేష్.. మాపై విమర్శలా? మంగళగిరిలో లోకేష్ కు మరోసారి సర్వమంగళమే !.. ‘మనం’ సినిమాలో మాదిరిగా మీ తండ్రి కొడుకులు జూబ్లీ ప్యాలెస్లో శేష జీవితం గడపండి.

ఏపీలో టీచర్ల డిజిటల్ అటెండెన్స్‌పై వివాదం.. సాంకేతిక సమస్యలతో చిక్కులు.. టీచర్లు ఏమంటున్నారంటే..

బాబు స్క్రిప్ట్,  ప్రొడక్షన్-  నాదెండ్ల డైరెక్షన్ లో నడుస్తున్న మీ పార్టీ  కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పూటకు ఒకరితో సంసారం చేస్తూ ఆర్నెల్లకు ఒకసారి బయటికి వచ్చే పవన్ గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు.  టిడిపి పల్లకి  మోయడమే పవన్ కళ్యాణ్ పాలసీ అంటూ మంత్రి అమరనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?