ఈనెల 10న డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి గంటా

By Nagaraju TFirst Published Oct 5, 2018, 4:45 PM IST
Highlights

ఎన్నాళ్ల నుంచో వాయిదా పడుతూ వస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. 9వేల 270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతిలో శుక్రవారం నోటిఫికేషన్ వివరాలపై చర్చించారు. ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తామని తెలిపారు. 
 

అమరావతి : ఎన్నాళ్ల నుంచో వాయిదా పడుతూ వస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. 9వేల 270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతిలో శుక్రవారం నోటిఫికేషన్ వివరాలపై చర్చించారు. ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తామని తెలిపారు. 

నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫలితాలను 2019 జనవరి 3న ఫలితాలు వెలువరిస్తామని స్పష్టం చేశారు. అలాగే పిఈటీ పోస్టుల పెంపుపై కేబినేట్ లో సీఎం చంద్రబాబుతో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామన్నారు. ఎస్జీటీ పోస్టులకు బిఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీ చెయ్యడంతో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు తెలిపారు. 

click me!