తోడ కొట్టి చెబుతున్నా నాతో చర్చకు సిద్ధమా...జగన్‌కు దేవినేని సవాల్

By sivanagaprasad kodatiFirst Published Nov 27, 2018, 9:37 AM IST
Highlights

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పెన్నా-గోదావరి అనుసంధానంపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఇరిగేషన్ గురించి వారికి ఏం తెలుసని ఉమా ప్రశ్నించారు. 

నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి బహిరంగ చర్చకు తాను సిద్ధమని దేవినేని తొడగొట్టారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి అన్నారు.

పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్‌కు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అడ్డుపడ్డారని.. కానీ ఇప్పుడు 5 నియోజకవర్గాల ప్రజలు గోదావరి నీటీతో బంగారం పండించారని ఉమా స్పష్టం చేశారు. డిసెంబర్ 17న తొలి క్రస్ట్ గేట్‌ను ప్రారంభిస్తున్నామని.. దీనికి దేశవ్యాప్తంగా పలువురికి ఆహ్వానాలు పంపుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ దశాబ్ధాల కల అని.. దీని వెనుక ఎంతోమంది శ్రమ ఉందన్నారు. 

click me!