వరదల్ని రాజకీయాలకు వాడతారా : పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు

By Siva KodatiFirst Published Jul 17, 2022, 8:12 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. సంక్షేమాన్ని చూసి చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారని ఆయన చురకలు వేశారు.

జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) విమర్శలు గుప్పించారు మంత్రి దాడిశెట్టి రాజా (dadisetti raja) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలు అర్ధరహితమని... మెనిఫెస్టో దాచి చంద్రబాబు (chandrababu naidu) ప్రజలను మోసం చేశారని రాజా దుయ్యబట్టారు. సంక్షేమాన్ని చూసి చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారని ఆయన చురకలు వేశారు. 

ఇకపోతే.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా (konaseema district) మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర (koulu rythu bharosa yatra) జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో గోదావరి జిల్లాల ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 

చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని.. ప్రభుత్వంలో లేకపోయినా కౌలు రైతులకు సాయం చేస్తున్నామని ఆయన అన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు ఇప్పటికే కోట్లాది రూపాయల సాయం చేశామని పవన్ గుర్తుచేశారు. రూ. 7 లక్షల బీమా సొమ్ము కౌలు రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను తాను స్పూర్తిగా తీసుకున్నానని.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సీఎం ఇష్టపడటం లేదని పవన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసును మభ్యపెట్టేందుకే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని జనసేనాని దుయ్యబట్టారు. 

Also Read:రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది గోదావరి జిల్లాలే.. వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపో మరి : పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో నా తెలంగాణ అనే భావన వుందని.. కులమనే భావన ఏపీలో వుందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని గౌరవిస్తూ , కులానికి అతీతంగా ఆలోచించాలని.. జేబులో డబ్బు తీసి ఇవ్వడం తమకు సరదా కాదన్నారు. అంబేద్కర్, మహాత్మా గాంధీలు జగన్ లాగా పాదయాత్రలు చేయలేదని, ముద్దులు పెట్టలేదంటూ సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆర్టికల్ 370ని తాత్కాలికంగా మాత్రమే అంబేద్కర్ పెట్టారని, అందువల్లే బీజేపీ ప్రభుత్వం దానిని తొలగించగలిగిందన్నారు. తాను చేయాల్సినవన్నీ రాజ్యాంగం ద్వారా అమలు చేయగలిగేలా అంబేద్కర్ చేశారని పవన్ ప్రశంసించారు. 

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే మొట్టమొదట స్వాగతించింది జనసేన మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల పైచిలుకు మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే .. ప్రభుత్వం కేవలం 7 వందల మందికే సాయం చేసిందని పవన్ దుయ్యబట్టారు. జనసేన నేతలకున్న సిమెంట్ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ఆస్తుల నుంచి కాకుండా ప్రభుత్వ ఖజానా నుంచే తాము సాయం చేయమని అడుగుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. 

click me!