పేదలకు రూ.10 వేల కోట్ల లాభం.. కానీ, ఓటీఎస్‌ స్కీమ్‌పై చంద్రబాబు కుట్ర : మంత్రి శ్రీరంగనాథరాజు

Siva Kodati |  
Published : Dec 05, 2021, 07:00 PM IST
పేదలకు రూ.10 వేల కోట్ల లాభం.. కానీ, ఓటీఎస్‌ స్కీమ్‌పై చంద్రబాబు కుట్ర : మంత్రి శ్రీరంగనాథరాజు

సారాంశం

ఓటిఎస్‌పై (ots scheme) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu ) కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు . పేదలకు లబ్దిచేకూరకుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం ద్వారా గృహాల లబ్దిదారులకు పదివేల కోట్ల రూపాయల మేలు జరుగుతుందని... అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు వుంటుందని రంగనాథ రాజు తెలిపారు. 

ఓటిఎస్‌పై (ots scheme) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu ) కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు (cherukuvada sriranganadha raju) ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన .. పేదలకు లబ్దిచేకూరకుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం ద్వారా గృహాల లబ్దిదారులకు పదివేల కోట్ల రూపాయల మేలు జరుగుతుందని... అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు వుంటుందని రంగనాథ రాజు తెలిపారు. పేదవారికి మేలు చేకూర్చేందుకే జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు. పధకం పట్ల ప్రజలలో అపోహలు తొలగించి... ప్రతి ఇంటిని సందర్శించి వారికి కలిగే మేలును వివరించాలని ఆయన అధికారుల ఆదేశించారు. అలాగే వైసీపీ నేతలు, కౌన్సిలర్లు కూడా ఇంటింటికి తిరిగాలని మంత్రి శ్రీరంగనాథరాజు పిలుపునిచ్చారు. 

ALso Read:వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ స్కీంపై దుష్ప్రచారం.. జగన్ ఆగ్రహం, బాధ్యులపై చర్యలకు ఆదేశం

అంతకుముందు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయని జగన్ అన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల్లో సందేహాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలని జగన్ సూచించారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలనుకూడా చూపించాలని సీఎం ఆదేశించారు. 

అలాగే పేదలకు ప్రయోజనం కలిగించేందుకే వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ప్రవేశపెట్టామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. (botsa satya narayana) గత బుధవారం అమరావతిలో మీడియాలో మాట్లాడిన ఆయన..  లబ్ధిదారులకు గృహహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇది బలవంతపు పథకం కాదని.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తింపజేస్తామని బొత్స తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం చేపట్టారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వివాదాస్పద ఆదేశం ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై టీడీపీ కుట్ర చేస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అధికారులు ఎవరూ ప్రజలను బలవంతం చేయరని.. పేదలపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్