ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం.. 20,70,835కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Dec 05, 2021, 06:22 PM ISTUpdated : Dec 05, 2021, 06:23 PM IST
ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం.. 20,70,835కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 177 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,122 మంది చికిత్స పొందుతున్నారు  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 154 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,70,835కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,452కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరు ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 177 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,54,261కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 30,379 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,05,70,020కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,122 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 12, చిత్తూరు 30, తూర్పుగోదావరి 14, గుంటూరు 16, కడప 4, కృష్ణ 14, కర్నూలు 1, నెల్లూరు 10, ప్రకాశం 3, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 20, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 18 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu