చంద్రబాబు పెద్ద మోసగాడు...ఆయన జీవితమంతా కుట్రలే: బొత్స ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Jun 19, 2020, 01:36 PM ISTUpdated : Jun 19, 2020, 01:39 PM IST
చంద్రబాబు పెద్ద మోసగాడు...ఆయన జీవితమంతా కుట్రలే: బొత్స ఫైర్

సారాంశం

రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేదని తెలిసినా టిడిపి అభ్యర్దిని నిలపటం నీచమని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేదని తెలిసినా టిడిపి అభ్యర్దిని నిలపటం నీచమని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గతంలో సంఖ్యాబలం ఉన్నప్పుడు గుర్తురాని దళితులు, సంఖ్యాబలం లేనప్పుడు గుర్తుకొచ్చినట్లున్నారని అన్నారు. ఓటమి తద్యం అని తెలిసినా వర్ల రామయ్యను బరిలోకి దింపటం దళితులను అవమానించటమేనని అన్నారు. చంద్రబాబు అంత మోసగాడు ఎవరూ లేరని...ఆయన జీవితం అంతా కుట్ర రాజకీయాలేనంటూ బొత్స విరుచుకుపడ్డారు. 

''గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టం లేని చంద్రబాబు అదే గవర్నర్ ను ఎలా కలుస్తాడు. చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చినిగిపోయింది.ఇంకా కొత్త పేజీలు లేవు'' అని ఎద్దేవా చేశారు. 

read more మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లు... మండలి పరిణామాలపై మాజీ మంత్రి సంచలనం

వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వివాదంగా మారిన నేపథ్యంలో బొత్స దీనిపై స్పందించారు. ఈ విషయం గురించి తాను మాట్లాడనని... ఆయనను పార్టీ చూసుకుంటుంది'' అని బొత్స వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu