భీమవరంలో డ్రగ్స్ కలకలం: ఇంజనీరింగ్ విద్యార్ధి అరెస్ట్

Published : Jun 19, 2020, 01:04 PM ISTUpdated : Jun 19, 2020, 01:07 PM IST
భీమవరంలో డ్రగ్స్ కలకలం: ఇంజనీరింగ్ విద్యార్ధి అరెస్ట్

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్ధిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.


భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్ధిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

నెదర్లాండ్ నుండి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ఇంటికి వచ్చిన పార్శిల్ పై ఆట బొమ్మలు ఉన్నాయి. అయితే ఆటబొమ్మలు ఉన్న పార్శిల్ ను తెరిచి చూసిన కస్టమ్స్ అధికారులకు తనిఖీ చేసి షాకయ్యారు.

ఈ పార్శిల్ లో సుమారు 400 మత్తు పదార్దాల మాత్రలు లభ్యమయ్యాయి. వాటి విలువ రూ. 12 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.పార్శిల్ లో పేర్కొన్న చిరునామాకు వెళ్లి ఇంజనీరింగ్ యువకుడు అరెస్ట్ చేసి చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. అతడిని రిమాండ్ కు తరలించారు.

ఇంజనీరింగ్ విద్యార్ధికి నెదర్లాండ్ నుండి ఎవరు డ్రగ్స్ పంపారు.. ఈ డ్రగ్స్ ను ఇక్కడ ఎవరికైనా విక్రయించేందుకు తీసుకొచ్చారా.... ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.భీమవరంలో డ్రగ్స్  వెలుగు చూడడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థి గత చరిత్రను కూడ అధికారులు వెలికితీస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే