వచ్చే ఉగాది నాటికి టీడీపీ , జనసేన వుండవు.. వుంటే గుండు గీయించుకుంటా : బొత్స వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 07:36 PM ISTUpdated : Aug 11, 2023, 07:50 PM IST
వచ్చే ఉగాది నాటికి టీడీపీ , జనసేన వుండవు.. వుంటే గుండు గీయించుకుంటా : బొత్స వ్యాఖ్యలు

సారాంశం

వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు వుండవన్నారు. అవి టీడీపీ, జనసేనలేనని.. ఇవి రెండు వుంటే గుండు గీయించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. 

వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు వుండవన్నారు. అవి టీడీపీ, జనసేనలేనని.. ఇవి రెండు వుంటే గుండు గీయించుకుంటానని బొత్స సవాల్ విసిరారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఆ పార్టీలకు లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే స్కీములు గుర్తుకొస్తున్నాని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం , రాజకీయాలంలే అసహ్యాం వేస్తోందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లు అయ్యింది దుకాణం తెరిచి.. నీ విధానం ఏంటీ అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. చెప్పులు అందరికీ వుంటాయని.. మాట్లాడితే చేతులు , కాళ్లు చూపిస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. 

అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా  రాష్ట్రంలో అధికారంలోకి రావన్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో  లోకేష్ యువగళం యాత్ర  అట్టర్ ప్లాఫ్ అంటూ  మంత్రి  అంబటి రాంబాబు  చెప్పారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి  ఒరిగిదేమీ లేదన్నారు . తన కుటుంబ సభ్యులు ఏ రోజూ రాజకీయ కార్యక్రమాల్లో  లేరని ఆయన  చెప్పారు. ఎన్నికల సమయంలోనే తన సోదరుడు, బిడ్డలు, అల్లుళ్లు  వస్తారన్నారు.  ఎన్నికలు పూర్తి కాగానే వారు వెళ్లిపోతారని అంబటి గుర్తు చేశారు. 

ALso Read: ముందు ఎమ్మెల్యేగా గెలువు: లోకేష్ పై మంత్రి అంబటి సెటైర్లు

వచ్చే ఎన్నికల సమయంలోనూ తన కుటుంబ సభ్యులు మరోసారి వస్తారని  మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్‌కు సరిగా తెలుగు మాట్లాడడం రాదని ఆయన  ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కొడుకుగా మంగళగిరిలో పోటీ చేసి  లోకేష్ ఓటమి పాలయ్యాడన్నారు. ముందు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆయన లోకేష్ కు సూచించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీఎం జగన్ చెడగొడుతున్నారని  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను  ఆయన  ప్రస్తావిస్తూ  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును జగన్ నిలబెట్టారన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే  నైజం కన్నా లక్ష్మీనారాయణదన్నారు.  టీడీపీలో కూడా కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ రోజులు ఉండడని ఆయన  అనుమానం వ్యక్తం  చేశారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్