అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

By narsimha lodeFirst Published Aug 20, 2019, 5:35 PM IST
Highlights

అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్సనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించినున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

అమరావతి: అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ విషయమై విధాన ప్రకటన చేయనున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

మంగళవారం నాడు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం భారీగా ఉందన్నారు. సాధారణ వ్యయం కంటే అమరావతిలో ఎక్కువ ఖర్చు అవుతోందని బొత్స సత్యనారాయణ చెప్పారు.

రాజధాని ప్రాంతంలో ఫైఓవర్లు, భారీ కట్టడాలు కట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల సంభవించిన వరదలతో ఈ ప్రాంతం ముంపుకు కూడ గురయ్యే అవకాశం ఉందని తేలిందన్నారు. దీని నుండి కాపాడేందుకు కాలువలు, డ్యామ్ లను నిర్మించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ చెప్పారు.

వరద నీటిని  బయటకు పంపేందుకు నీటిని తోడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణాలపై ప్రభుత్వం అమరావతి విషయమై చర్చిస్తున్నట్టుగా బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

వారం రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా, అంతా పబ్లిసిటీ కోసమే : చంద్రబాబుపై బొత్స

click me!