టీడీపీకి 38 శాతం వచ్చాయా.. ఎక్కడ ఆంధ్రాలోనా, అసోంలోనా: బాబుపై బొత్స సెటైర్లు

By Siva KodatiFirst Published Feb 10, 2021, 3:51 PM IST
Highlights

వైసీపీ పతనం కాదు చంద్రబాబు తుడిచిపెట్టుకోవడం మొదలైందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో 38 శాతం చంద్రబాబుకు ఎక్కడ వచ్చిందని బొత్స ప్రశ్నించారు.


వైసీపీ పతనం కాదు చంద్రబాబు తుడిచిపెట్టుకోవడం మొదలైందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో 38 శాతం చంద్రబాబుకు ఎక్కడ వచ్చిందని బొత్స ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చాయా..? అసోంలో వచ్చాయా అని నిలదీశారు. చంద్రబాబు మాటలకు నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కావడం లేదంటూ బొత్స సెటైర్లు వేశారు. ఏకగ్రీవాలతో కలిపి 2,637 మంది వైసీపీ మద్ధతుదారులే గెలిచారని.. టీడీపీ కేవలం 508, ఇతరులు 99 గెలిచారని మంత్రి చెప్పారు.

82 శాతం స్థానాలను వైసీపీ మద్ధతుదారులే గెలిచారని బొత్స వెల్లడించారు. కేవలం 15 శాతమే టీడీపీ మద్ధతుదారులు గెలిచారని చెప్పారు. చంద్రబాబు అబద్ధాల కోరని.. నోరు తెరిస్తే అబద్ధమంటూ ధ్వజమెత్తారు. 

అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అనుకూల మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు వెలువడ్డాయన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష టీడీపీ వెంటిలేటర్‌పై వుందని.. తొలి దశ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులు భారీగా గెలిచారని సజ్జల స్పష్టం చేశారు.

ఎన్నికల్లో తెలుగుదేశం ఎక్కడా కనిపించలేదన్నారు. టీడీపీ వాళ్లది ఏం ఆనందమో తెలియడం లేదని సజ్జల ఎద్దేవా చేశారు. ఎందుకు తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారని ఆయన నిలదీశారు.  

click me!