కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనళ్లుడు మజ్జి శ్రీనివాసరావ్ - న్యాయవాది సలీం

Published : Aug 30, 2023, 07:44 AM IST
కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనళ్లుడు మజ్జి శ్రీనివాసరావ్ - న్యాయవాది సలీం

సారాంశం

కోడి కత్తి కేసులో విశాఖలో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం నిందితుడి తరఫు న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనళ్లుడు మజ్జి శ్రీనివాసరావు దినేష్ కుమార్ కు కోడి కత్తి ఇచ్చారని ఆరోపించారు.

కోడికత్తి కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇంత కాలం పాటు విజయవాడ కోర్టులో జరిగిన విచారణ.. తొలిసారిగా విశాఖకు మారింది. ఈ సందర్భంగా విచారణ అనంతరం నిందితుడి జనపల్లి శ్రీనివాసరావు తరఫు లాయర్ సలీం మీడియాతో మాట్లాడారు. కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనళ్లుడు మజ్జి శ్రీనివాసరావే అని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన నాడు ఆ కోడి కత్తిని దినేష్ కుమార్ కు శ్రీనివాస్ రావే ఇచ్చారని అన్నారు. కానీ నేరాన్ని శ్రీనుపై మోపారని చెప్పారు. సీఎం జగన్ ఈ కేసులో కావాలనే విచారణకు హాజరుకావడం లేదని తెలిపారు. విచారణకు హాజరైతే నిజాలు బయటపడుతాయని ఆయన భావిస్తున్నారని లాయర్ ఆరోపించారు. 

హృదయ విదారకం.. ప్లాస్టిక్ కవర్ లో కుమారుడి డెడ్ బాడీ పెట్టి.. 70 కి.మీ బైక్ పై తండ్రి ప్రయాణం

కేవలం రాజకీయాల కోసమే ఈ కోడి కత్తి కేసును సాగదీస్తున్నారని న్యాయవాది సలీం ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు రావాలని కోరారు. ఎన్ వోసీ ఇవ్వాలని అన్నారు. ఈ కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) గతంలోనే తేల్చి చెప్పిందని లాయర్ తెలిపారు. 

Food poisoning: పెళ్లి భోజనం తిన‌డంతో 150 మందికి అస్వ‌స్త‌త‌.. ఆస్పత్రికి త‌ర‌లింపు

కాగా..ఈ  కోడి కత్తి కేసును తొలిసారిగా విశాఖకు బదిలీ చేసిన తరువాత నిందితుడైన జనపల్లి శ్రీనును పోలీసులు 10.45 గంటలకు థర్డ్ అడిషనల్ హాజరుపర్చారు. దీని కోసం ఆయనను రాజమహేంద్రవరం జైలు నుంచి బందోబస్తుతో తీసుకొని వచ్చారు. కాగా.. కేసును కోర్టు సెప్టెంబర్ 6వ తేదీ వరకు కోర్టు వాయిదా వేసింది. అదే రోజు నిందితుడి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే నిందితుడిని మళ్లీ  రాజమహేంద్రవరం జైలుకే తీసుకెళ్లారు.

కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో రూ.44 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం..

ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి, ఎన్ వోసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ దళిత సంఘాల ఐక్య వేదిక నిరసన తెలిపాలని నిర్ణయించుకున్నాయి. విశాఖలోని జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేయాలని భావించాయి. కానీ నిరసన చేపట్టకముందే పోలీసులు దళిత సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్