చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు.. పవన్‌లా మాట్లాడారా, రక్తం మరుగుతోంది : బొత్స వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 19, 2022, 9:48 PM IST
Highlights

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ మాటలు వింటే రక్తం మరుగుతోందని.. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా .. ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని ఆయన గుర్తుచేశారు. 
 

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు జనసేన ఓ రాజకీయ పార్టీ కాదని, అదో సెలబ్రెటీ పార్టీ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు , ప్రతి విమర్శలు సహజమని కానీ పవన్ వ్యాఖ్యలు మాత్రం ఆ హద్దులను దాటేశాయని బొత్స మండిపడ్డారు. మంత్రులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. 

విశాఖలో పవన్ తన సభను తానే రద్దు చేసుకున్నారని.. ర్యాలీగా వెళ్లకుండా సభ నిర్వహించుకోవాలని మాత్రమే పోలీసులు చెప్పారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పవన్ విశాఖ వచ్చిన రోజున తానే గంటన్నరపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయానని తెలిపారు. పవన్ మాటలు వింటే రక్తం మరుగుతోందని.. తమకు సంస్కారం వుంది కాబట్టే మౌనంగా వున్నామని బొత్స స్పష్టం చేశారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా .. ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని ఆయన గుర్తుచేశారు. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ నడిపిస్తోందని.. పాదయాత్ర చేస్తున్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని బొత్స ఆరోపించారు. 

అంతకుముందు బుధవారం వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ మంచితనం చూశారని అన్నారు. ప్యాకేజ్ స్టార్‌ అనే సన్నాసి నా కొడుకులు ఎవరంటూ ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే వైసీసీ నాయుకులను చెప్పు తీసుకోని కొడతానని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తన చెప్పు తీసి మరి చూపించారు. పవన్ కల్యాణ్ ఈరోజు మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కాలంలో తాను ఆరు సినిమాలు చేశానని చెప్పారు. 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించానని తెలిపారు. తన పిల్లల పేరు మీద డిపాజిట్ చేసిన డబ్బుతో జనసేన పార్టీ కార్యాలయం కట్టానని చెప్పారు.

ALso Read:తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా.. నేను యుద్దానికి రెడీ: వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

జనసేన పార్టీ ఖాతాలు, లెక్కల వివరాలను పవన్ కల్యాణ్ వివరించారు. రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 12 కోట్లు, అయోధ్య రామాలయానికి రూ. 30 లక్షల విరాళం ఇచ్చినట్టుగా చెప్పారు.  పార్టీ పెట్టినప్పటీ నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15.58 కోట్ల కార్పస్‌ఫండ్ విరాళాలు వచ్చాయని తెలిపారు. కౌలు రైతు భరోసా యాత్రం రూ. 3.5 కోట్లు వచ్చాయని చెప్పారు. నా సేన కోసం నా వంతుకు రూ. 4 కోట్లు వచ్చాయని తెలిపారు. 

తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదే పదే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. విడాకులు ఇచ్చే తాను పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. చట్టప్రకారమే వారికి భరణం చెల్లించానని తెలిపారు. మొదటి భార్యకు 5 కోట్ల డబ్బు, రెండో భార్య మిగిలిన ఆస్తి ఇచ్చానని అన్నారు. విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మీకేంటి అభ్యంతరం అని ప్రశ్నించారు. ఒక్కరిని పెళ్లి చేసుకుని.. 30 మంది స్టెపిన్‌లతో తిరిగే సన్నాసులకు తాను సమాధానం చెప్పేలా అంటూ మండిపడ్డారు. యుద్దం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టుగా తెలిపారు. 

click me!