ఏపీలో టీచర్లను లోపలేస్తున్నారన్న హరీశ్ రావు.. వచ్చి చూడాలంటూ బొత్స కౌంటర్

By Siva KodatiFirst Published Sep 29, 2022, 7:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్‌కు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులపై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. హరీశ్ రావు ఒకసారి ఏపీకి రావాలని ఆయన కోరారు. ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని.. తెలంగాణ , ఏపీ పీఆర్సీలు పక్కపక్కపెట్టి చూస్తే తేడా తెలుస్తుందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా వున్నారని బొత్స పేర్కొన్నారు. 

అంతకుముందు మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో టీచర్లకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని మంత్రి అన్నారు. అయితే రాష్ట్రంలో వేతనాలు కాస్త ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని హరీశ్ రావు అంగీకరించారు. అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్‌లా కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరించి వుంటే ఏటా రూ.6 వేల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేవారమని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso REad:తిరుపతిలో గుత్తి, అనంతపురం వాళ్లు ఏం చెప్పారంటే.... ఏపీలో కరెంట్ కష్టాలపై హరీశ్ రావు వ్యాఖ్యలు

ఇకపోతే... ఏపీలో కరెంట్ కోతలపైనా హరీశ్ రావు మొన్నామధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరినీ కలిశానని చెప్పారు. వాళ్లది గుత్తి, అనంతపురం అని చెప్పారని... మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వుంటుందని అడిగానని హరీశ్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కరెంట్ వుంటుందని తనకు చెప్పారని మంత్రి చెప్పారు. మళ్లీ గంట గంటకి కరెంట్ పోతుందని తెలిపారని హరీశ్ రావు వెల్లడించారు. 
 

click me!