వైసీపీ వివాదాస్పద ట్వీట్‌: అన్నార్తుల ఆకలి తీర్చడంలో తప్పేముంది.. బీజేపీకి బొత్స కౌంటర్

Siva Kodati |  
Published : Feb 19, 2023, 05:07 PM IST
వైసీపీ వివాదాస్పద ట్వీట్‌: అన్నార్తుల ఆకలి తీర్చడంలో తప్పేముంది.. బీజేపీకి బొత్స కౌంటర్

సారాంశం

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌‌పై బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. తమ వల్ల ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో చెప్పాలని మంత్రి చురకలంటించారు. 

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌‌పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. జగన్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తాము కూడా హిందువులమేనని.. అన్నార్తుల ఆకలి తీర్చడం అన్న మాటలో తప్పేముందని బొత్స నిలదీశారు. బీజేపీ వక్రభాష్యం ఆపాలని.. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో చెప్పాలని మంత్రి చురకలంటించారు. 

కాగా. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్‌‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో సీఎం జగన్ పంచెకట్టులో ఒక బాలుడికి పాలు తాగిస్తున్నారు.. ఆ చిన్నారి చేతిలో వున్న వస్తువులు, పులి చర్మం , పక్కనే వున్న నందిని చూస్తే.. అచ్చం జగన్ బాల శివుడికి పాలు తాగిస్తున్నట్లుగా వుంది. అంతేకాదు.. అన్నార్తుల ఆకలి తీర్చడే ఈశ్వరారాధన అని కామెంట్ సైతం పెట్టింది.

దీనిపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. తక్షణం ఆ ట్వీట్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ నుంచి తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగన్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం ఈ పోస్ట్‌పై స్పందించారు. భగవంతుడికే పాలు పోసే స్థాయిలో జగన్‌ను చూపించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. సీఎం ఏ మతాన్ని అవలంభించినా.. హిందూ మతాన్ని అవమానించడం బాధాకరమని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ఎంతోమంది పిల్లలు ఆహారం లేదని గగ్గోలు పెడుతున్నారని.. ముందు వాళ్లను పట్టించుకోవాలని జీవీఎల్ నరసింహారావు చురకలంటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే