లైంగిక వేధింపుల ఆరోపణలు: అనకాపల్లి జూడో కోచ్ శ్యామ్యూల్ రాజుపై వేటు

By narsimha lode  |  First Published Feb 19, 2023, 3:54 PM IST

మహిళా  క్రీడాకరులపై  లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా  ఆరోపణలు  ఎదుర్కొంటున్న  కోచ్  శ్యామ్యూల్  రాజును  విధుల నుండి తప్పించారు. 


అమరావతి: లైంగిక వేధింపుల  ఆరోపణలు ఎదుర్కొంటున్న  జూడో  కోచ్ శ్యామ్యూల్ రాజును  తొలగిస్తూ  శాప్  ఎండీ  హర్షవర్ధన్  ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో  శ్యామ్యూల్ రాజు  జోడో  కోచ్ గా  విధులు నిర్వహిస్తున్నాడు.  

జూడో  కోచ్  శ్యామ్యూల్ రాజు  మద్యం మత్తులో  తమపై  లైంగికంగా వేధింపులకు  పాల్పడినట్టుగా విద్యార్ధినులు ఆరోపించారు. మూడు రాత్రులు గడపాలని  తమను లైంగికంగా  వేధింపులకు  పాల్పడినట్టుగా విద్యార్ధినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు.  తనకు సహకరిస్తే క్రీడల్లో  మీ భవిష్యత్తు  బాగుంటుంది.. లేకపోతే  నాశనం చేస్తానని  తమను  ఇబ్బంది పెట్టినట్టుగా  బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

Latest Videos

undefined

చెన్నైలో  జరిగే  జాతీయ జూడో  పోటీల్లో  పాల్గొనేందుకు  వెళ్తూ  విజయవాడలో  ఆగిన జూడో  విద్యార్ధినులపై  శ్యామ్యూల్ రాజు  అసభ్యంగా  ప్రవర్తించినట్టుగా  ఆరోపణలు వచ్చాయి.   ఈ విషయమై బాధితులు  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. 

తనకు సహకరించకపోతే ఇబ్బందిపెడతానని కూడా  జూడో  కోచ్  వార్నింగ్  ఇచ్చారని  బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.   దీంతో  శ్యామ్యూల్ రాజును  విధుల నుండి తప్పించారు. 

ఔట్ సోర్సింగ్  పద్దతిలో  జూడో  కోచ్ గా  శ్యామ్యూల్ రాజు విధులు నిర్వహిస్తున్నాడు.  బాధితుల ఫిర్యాదు  మేరకు  పోలీసులు కేసు నమోదు చేయడంతో  శ్యామ్యూల్  రాజును విధుల నుండి తప్పిస్తున్నట్టుగా   శాప్  ఎండీ హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ  చేశారు. 


 

click me!