రాజకీయాల్లో ఎవరైనా వారసుల్ని దింపొచ్చు.. కానీ.. : మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Sep 29, 2022, 3:25 PM IST
Highlights

ప్రతి రాజకీయ పార్టీకి అంతిమ లక్ష్యం గెలుపేనని.. ఇదే విషయాన్ని గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో సీఎం జగన్ చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి రాజకీయ పార్టీకి అంతిమ లక్ష్యం గెలుపేనని.. ఇదే విషయాన్ని గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో సీఎం జగన్ చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయం సాధించి చరిత్ర తిరగేస్తామని తెలిపారు.  తమది అతివిశ్వాసం కాదని చెప్పారు. రాష్ట్రానికి పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి టీడీపీ అవసరం లేదని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వారసులు అందరికీ ఉంటారుని.. ఎవరైనా వారసుల్ని దింపొచ్చు.. కానీ ప్రజలు ఆమోదించాలని అన్నారు. తనకు కూడా అబ్బాయి ఉన్నాడని.. కానీ అతడు వైద్య రంగం వైపు వెళ్లాడని చెప్పారు. 

ఎన్నికల్లో ఒక్క స్థానం పోయినా పర్వాలేదు అనుకుంటే.. ఆ సంఖ్య  10 అవుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై తనకు సమాచారం లేదని అన్నారు. నిన్నటి సమావేశంలో గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్లాలనే మాట సీఎం జగన్ గట్టిగానే చెప్పారని అన్నారు. 

click me!