గ్యాస్‌ లీక్‌పై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం: బాబువి చౌకబారు వ్యాఖ్యలన్న బొత్స

By Siva KodatiFirst Published May 8, 2020, 9:00 PM IST
Highlights

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికావన్నారు.

ప్రతిపక్షనేత చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, బాధితులను వేగంగా ఆదుకోవడం తప్పా అని బొత్స ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించడం తప్పా అని ఆయన నిలదీశారు.

Also Read:ఎల్జీ పాలిమర్ ప్రతినిధుల అరెస్ట్ ఎప్పుడు?: సీఎంను ప్రశ్నించిన దేవినేని ఉమ

ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చౌకబారుగా మాట్లాడటం దారుణమని బొత్స మండిపడ్డారు. ఎల్జీ పామర్స్‌కు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ప్రమాద ఘటనపై చర్యలు  తీసుకుంటామన్న బొత్స... కమిటీ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. ప్రజల క్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, బాధితుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Also Read:విశాఖ గ్యాస్ లీకేజీ : ప్రజల ప్రాణాలు కాపాడిన పబ్ జీ గేమ్!

బాధితులందరికీ పరిహారం అందజేస్తామని.. 17 కేంద్రాల్లో ప్రజలకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, బాధితులను అన్ని రకాలుగా ప్రభుత్వం అందుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించామని వెల్లడించారు. 

click me!