టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 10, 2019, 5:14 PM IST
Highlights

టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిట్ రూ.4.80కే లభ్యమైనా.. రూ.11.68కు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఆయన తప్పుబట్టారు

టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిట్ రూ.4.80కే లభ్యమైనా.. రూ.11.68కు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఆయన తప్పుబట్టారు.

కర్ణాటక రాష్ట్రంలోని కుడిగి ఎన్‌టీపీసీ ప్లాంట్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉన్నా చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందని బాలినేని గుర్తు చేశారు.

కుడిగి ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకపోవడం వల్ల రూ.317 కోట్ల మేర స్థిర ఛార్జీలను చెల్లించాల్సి వచ్చిందని బాలినేని తెలిపారు. సౌర విద్యుత్ కంపెనీల నుంచి అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేసి ఎన్టీపీసీ నుంచి కొనుగోళ్లను ఉద్దేశ్యపూర్వకంగానే తగ్గించారని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్.

ప్రస్తుతం విద్యుత్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా యూనిట్‌ను రూ.2.95 పైసల నుంచి రూ.3.41 పైసలకే కొనుగోలు చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 2018తో పోలిస్తే.. 2019లో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 
 

click me!