
టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జైలుకెళ్లడం ఖాయమని.. జగన్ అరెస్టుని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల తరువాత వైఎస్ కుటుంబాన్నిఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఓడించారని ఆయన అన్నారు.
ఇక వైసీపీలో చీలికలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా చంద్రబాబు పై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయిందన్నారు. అసలు చంద్రబాబును విమర్శించే అర్హత.. వయస్సు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న ఫైర్ అయ్యారు.