అక్వా కల్చర్‌కి అథారిటీ ఫైలుపై సంతకం:బాధ్యతలు స్వీకరించిన అప్పలరాజు

Published : Jul 26, 2020, 02:02 PM IST
అక్వా కల్చర్‌కి అథారిటీ ఫైలుపై సంతకం:బాధ్యతలు స్వీకరించిన అప్పలరాజు

సారాంశం

పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య , పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఆదివారం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. 

అమరావతి: పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య , పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఆదివారం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. 

తొలుత బ్లాక్ ముఖ ద్వారంవద్ద అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా  ఛాంబర్ లో ప్రత్యేక పూజలను కుటుంబ సమేతంగా నిర్వహించారుమంత్రి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతనంగా కేటాయించిన చాంబర్లో  మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు.

 ఆక్వా కల్చర్ కి కొత్తగా అథారిటీ క్రియేట్ చెయ్యడానికి సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు.అనంతరం మంత్రి మీడియాతో  మాట్లాడారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన  ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి  ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి  దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. స్వతహాగా తాను మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో  ఈ శాఖని కేటాయించడం  చాలా సంతోషంగా ఉందన్నారు. ఆక్వా అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు.

మంచి ధర కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతులకు మద్దతు ధర లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు హమీలకే పరిమితమై ప్రజలను మోసం చేశాయన్నారు.   ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్వా కల్చర్ అథారిటి ని ఏర్పాటు చేసి చూపించారని ఆనందంవ్యక్తం చేశారు. 

పాడి పరిశ్రమ కోసం రైతులకు పాల ధర పెంచాలి అనే ఉదేశ్యం తో బడ్జెట్ లో 700 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు.ఇప్పటి కే ఆమూల్ కంపెనీ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవొయు కుదుర్చుకున్న విషయాన్ని మంత్రి అప్పలరాజు గుర్తు చేశారు. 

పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉదేశ్యం తో రాష్ట్రంలో నాలుగు చోట్ల ఫిష్షింగ్  హార్బర్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు, ఇప్పటికే మూడు చోట్ల ఫిష్షింగ్ హార్బర్ల ఏర్పాటు కి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 

త్వరలో పనులు మొదలుపెడతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం,రాష్ట్ర  రెవెన్యూ,స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖా  మంత్రి ధర్మాన కృష్ణదాస్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు ఐఏఎస్,పశు సంవర్ధకశాఖ  డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎపి ఎల్ డి సి సీఈఓ దామోదర్ నాయుడు,పి.రామకోటేశ్వరరావు  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అప్పలరాజుకు పుష్పగుచ్ఛాలను అందజేసి 

PREV
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu