చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు.. నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడలేదు : అంబటి ట్వీట్ వైరల్

By Siva KodatiFirst Published Jan 16, 2024, 6:19 PM IST
Highlights

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ సీనియర్ నేత , మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు వున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల నిమిత్తం ఈ పిటిషన్‌ను సీజేఐ బెంచ్ సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత , మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడలేదని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

"నేరస్తుడిని"
ఏ న్యాయస్థానమూ కాపాడదు!

— Ambati Rambabu (@AmbatiRambabu)

 

చంద్రబాబు  కేసులో సరైన అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని జస్టిస్ అనిరుద్ధబోస్ వ్యాఖ్యానించారు. సెక్షన్ 17ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేనిపక్షంలో అది చట్ట విరుద్ధమని న్యాయమూర్తి న్నారు. అలాగే 2018 నాటి చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సీజేఐ బెంచ్‌కు నివేదించారు. 

కాగా.. గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సిద్ధార్ధ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనలు ముగిసిన అనంతరం జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం కేసును గతేడాది అక్టోబర్ 17న తీర్పును వాయిదా వేసింది. 
 

click me!