
తాను ఫెయిల్డ్ పొలిటీషియన్‌ని అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కేవలం నటుడిగానే సక్సెస్ అయ్యారని.. ఎప్పటి నుంచో రాజకీయాల్లో వున్న ఆయన ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేదన్నారు. ఇకపై కూడా పవన్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యేది లేదని రాంబాబు జోస్యం చెప్పారు. సిద్ధాంతాలు లేని పవన్.. రాజకీయాల్లో తన పాత్రను సరిగా నిర్వర్తించలేకపోతున్నారని అంబటి దుయ్యబట్టారు. తనను తాను చేగువేరా అని చెప్పుకుంటున్న పవన్.. సిద్ధాంతాలను పక్కనబెట్టి కలిశారని ఎద్దేవా చేశారు.
ALso REad:నేను ఫెయిల్డ్ పొలిటీషియన్‌ని : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే... హైదరాబాద్ శిల్పకళా వేదికలో శనివారం జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు.. పేరున్న వాళ్లంతా మహానుభావులు కాదన్నారు. దేవుడినైనా గుడ్డిగా నమ్మొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పటి వరకు తాను ఫెయిల్డ్ పొలిటీషియన్‌ని అన్న ఆయన.. ఓటమిని ఒప్పుకోవాలని, దీనిపై తానేమీ బ్యాడ్‌గా ఫీల్ కావట్లేదన్నారు. ఓటమే విజయానికి సగం పునాది అని పవన్ పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలని జనసేనాని వ్యాఖ్యానించారు.