వేలకోట్లు నొక్కేసేందుకే పోలవరం తీసుకున్నాడు .. చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 08, 2023, 05:27 PM IST
వేలకోట్లు నొక్కేసేందుకే పోలవరం తీసుకున్నాడు .. చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

సారాంశం

పోలవరంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు.  రూ . వేల కోట్లు నొక్కేసేందుకే మోడీ, గడ్కరీ కాళ్లు పట్టుకుని పోలవరాన్ని చంద్రబాబు తీసుకున్నారని రాంబాబు ఆరోపించారు. 

పోలవరంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై అన్ని వివరాలు ప్రజల ముందు వుంచామన్నారు. నాడు-నేడుతో అప్పుడు, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా వుందో చూపించామని అంబటి పేర్కొన్నారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని రాంబాబు ప్రశ్నించారు.

2019 నాటికి పోలవరం పూర్తి చేయడంలో చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారని ఆయన నిలదీశారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకపోవడం అశాస్త్రీయం కాదా అని దుయ్యబట్టారు. చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. రూ . వేల కోట్లు నొక్కేసేందుకే మోడీ, గడ్కరీ కాళ్లు పట్టుకుని పోలవరాన్ని చంద్రబాబు తీసుకున్నారని రాంబాబు ఆరోపించారు. 

ఇకపోతే.. పోలవరం నిర్మాణంలో, ముంపు బాధితులకు సాయం అందించడంలో తమ ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదని ఏపీ  సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలనేదే తమ సంకల్పం అని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద  ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల ప్రజలతో మాట్లాడుతూ.. వరద బాధితులకు సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అధికారులు గ్రామాల్లోనే ఉండి.. వరద  బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు. 

ALso Read: పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పం.. క్రెడిట్ ఆశించడం లేదు: సీఎం జగన్

సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని.. నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరద బాధితులకు నిత్యవసరాలు అందించామని ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించామని  చెప్పారు. ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే తమ తాపత్రయం అని అన్నారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదని అన్నారు. ఎవరికైనా వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని కోరారు. 

పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీకి ఈ నెలఖారు వరకల్లా కేంద్రం కేబినెట్ ఆమోదం తెలుపుతుందనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేని.. బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుందని అన్నారు. ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర నిధులు అందిస్తామని అన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?