ఆ పని పూర్తి చేసి డ్యాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.. మంత్రి అంబటిపై నాగబాబు సెటైర్లు..

Published : Jan 16, 2023, 10:01 AM IST
ఆ పని పూర్తి చేసి డ్యాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.. మంత్రి అంబటిపై నాగబాబు సెటైర్లు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు సెటైర్లు వేశారు. 

ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు సెటైర్లు వేశారు. ఇటీవల భోగీ వేడుకల్లో భాగంగా మంత్రి అంబటి రాంబాబు బంజారా మహిళలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ట్విట్టర్‌లో అంబటి రాంబాబు చేసిన పోస్టుపై నాగబాబు స్పందించారు. అంబటి రాంబాబు డ్యాన్స్ బాగా చేశారని.. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఇంకా బాగుండేదని సెటైర్లు వేశారు. 

‘‘సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు... పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. మరి దీనిపై మంత్రి అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. 

 

 

ఇక,  పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం