వైద్యం వికటించి బాలింత మృతి... ఆరోగ్య మంత్రి నాని సీరియస్

By Arun Kumar PFirst Published Jan 28, 2021, 11:09 AM IST
Highlights

బాలింత మృతిచెందిన వేలేరుపాడులోని శ్రీనివాస్ నర్సింగ్ హోం పై విచారణకు అదేశించారు మంత్రి ఆళ్ల నాని. 

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో వైద్యం వికటించి బాలింత మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర సమాచారాన్ని డిఎంహెచ్వో డాక్టర్ సునందను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఎక్కడ కూడా ఆర్ఎంపీలు పరిధి ధాటి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

బాలింత మృతిచెందిన వేలేరుపాడులోని శ్రీనివాస్ నర్సింగ్ హోం పై విచారణకు అదేశించారు మంత్రి. బాలింత మృతికి బాద్యులైన ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో సునందను అదేశించారు.  బాలింత మృతిపై ఒక సీనియర్ గైనకాలజిస్తును విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో ను  మంత్రి అదేశించారు. 

వేలేరుపాడులో హాస్పిటల్ ను ఇప్పటికే సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజతో కూడా ఫోన్ లో మాట్లాడిన మంత్రి మృతి చెందిన బాలింత నాగమణి కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు మంత్రి ఆళ్ల నాని. 
 

click me!