
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండల పరిధితో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లిసాల గ్రామం వద్ద ఓ కారు వేగంగా వెళుతూ కరెంటు స్తంభాన్ని డీకొట్టింది. ఈ క్రమంలోనే కారు విద్యుత్ షాక్ కు గురయి దగ్దమయిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవదహనం అయ్యారు.
గోకవరం నుండి వైజాగ్ వెళ్తున్న మారుతి 800 కారు ఈ ప్రమాదానిలో లోనయ్యింది. కారు వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడింది. దీంతో విద్యుత్ తీగలు కూడా కారుపై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు తప్పించుకోలేక సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వీడియో
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అలాగే స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు, ఎస్సై రామకృష్ణ తెలిపారు.