ఆనందయ్య మందు : సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అపోహలు వద్దు.. ఆళ్లనాని..

By AN TeluguFirst Published May 24, 2021, 1:00 PM IST
Highlights

రాష్ట్రంలో బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్మన్ షెడ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. 

రాష్ట్రంలో బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్మన్ షెడ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 30 బెడ్లను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ కూడా అందుబాటులో ఉంచామని ఆళ్ల నాని పేర్కొన్నారు.

నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ అధ్యక్షతన ఆనందయ్య మందిపై చర్చించామని, ఇప్పటికే కమిటీ వేసి పూర్తిస్థాయిలో అధ్యయనం జరుగుతోందని మంత్రి తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఆనందయ్య మందు పై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. టిడిపి నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని... టీడీపీ నేతల తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి ఆళ్ల నాని  మండిపడ్డారు.

కాగా, నెల్లూరు జిల్లా, క్రిష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరు పై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ  సీసీఆర్ఏఎస్ నాలుగు దశల్లో ఆ మందును విశ్లేషించింది. 

మొదటి దశలో భాగంగా మందు తీసుకున్న వారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి సీసీఆర్ఏఎస్ అప్పగించింది.

ఇప్పటికే మందు తీసుకున్న వారి ఫోన్ నెంబర్లను పోలీసులు సేకరించిన నేపథ్యంలో విజయవాడ ప్రాంతీయ పరిశోధన స్థానం, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు మందు తీసుకున్న 500 మంది కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

click me!