
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల సామాజిక న్యాయభేరి (samajika nyaya bheri) బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి పలు సభల్లో ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు వైద్యులు. విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ (ys jagan).. మంత్రి మంత్రి సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సూచించారు సీఎం జగన్. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు మంత్రి ఆదిమూలపు సురేష్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.