ఇంటికి వెళ్లాలన్న తపన, ఆపై మద్యం మత్తు.... అన్ని వెరసి ఒక వలస కార్మికుడిచేత ఏకంగా ఆర్టీసీ బసునే దింగలించేలా చేసాయి. అలా ఆ బస్సును దొంగలించిన వలస కార్మికుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఇంటికి వెళ్లాలన్న తపన, ఆపై మద్యం మత్తు.... అన్ని వెరసి ఒక వలస కార్మికుడిచేత ఏకంగా ఆర్టీసీ బసునే దింగలించేలా చేసాయి. అలా ఆ బస్సును దొంగలించిన వలస కార్మికుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే.... ధర్మవరం పరిసర ప్రాంతాల్లోని కర్ణాటకకు చెందిన వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపించడానికి అధికారులు అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక శ్రామిక్ రైలును ఏర్పాటు చేసారు. ఇందుకోసం అధికారులు ధర్మవరం నుంచి వలస కూలీల కోసం అనంతపురం రైల్వే స్టేషన్ కి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసారు.
undefined
అందరూ కూలీలతోపాటుగా బస్సు ఎక్కిన సదరు ముజామిల్ ఖాన్ మద్యం మత్తులో బస్సు ఎక్కగానే వెనక నిద్రపోయాడు. అయితే.... కూలీలు ప్రయాణిస్తున్న బస్సును వెనక్కి రప్పించి మరోబస్సులో కూలీలను తరలించారు అధికారులు. ఇదంతా జరుగుతున్నా కూడా సదరు వలసకూలీ మాత్రం మద్యం మత్తులో వెనక సీట్లో నిద్రించాడు.
మెలుకువ వచ్చి చూసే సరికి అతను డిపోలో ఉన్న బస్సులో ఉండడం గమనించాడు. అక్కడ ఆగి ఉన్న బస్సు తాళంచెవి బుస్సుకే ఉండడంతో ముజామిల్ బస్సును తోలుకుంటూ అక్కడి నుండి ఉడాయించాడు. దీన్ని గమనించిన ఒక డ్రైవర్ డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. మేనేజర్ పోలీసులకు సమాచారం చేరవేయడంతో.... వారు అతడిని వెంబడించి పెనుకొండ వద్ద పట్టుకున్నారు.
ఇకపోతే.... లాక్ డౌన్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో చిక్కుకున్న ఇతరరాష్ట్రాల వలసకూలీలను తరలించేందుకు ఏర్పాటుచేసిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. తమిళనాడు నుండి వచ్చిన బస్సు గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదానికి గురవగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను కాపాడి ఆస్పత్రికి తరలించడమే కాదు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇలా ప్రమాద బాధితులను కాపాడి గొప్పమనసును చాటుకున్నారు మంత్రి అనిల్.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు కు చెందిన వలసకూలీలను స్వరాష్ట్రానికి తరలించేందుకు ఆ రాష్ట్రం నుండి ఓ బస్సు ఏపికి వచ్చింది. అయితే గుంటూరు జిల్లా ఓబులనాయుడు పాలెం వద్ద జాతీయరహదారిపై ప్రయాణిస్తుండగా బస్సు ఓ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ లోనే చిక్కుకుపోయాడు.
అదే సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న మంత్రి అనిల్ కుమార్ ఈ ప్రమాదాన్న గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అతికష్టం మీద డ్రైవర్ ను బయటకు తీయించారు. అనంతరం డ్రైవర్, క్లీనర్ కి స్వయంగా ప్రథమచికిత్స చేసిన మంత్రి అనంతరం ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించారు.