డాక్టర్ సుధాకర్ తల్లికి బెదిరింపులు... ఫోన్ చేసిన దళిత మంత్రి: జవహర్ ఆగ్రహం

By Arun Kumar PFirst Published May 22, 2020, 10:02 PM IST
Highlights

దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో వైసిపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ  మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని....ఇలా వారిని బెదిరించి లొంగతీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దళితులకు వచ్చిన వెసులుబాటు లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు.

''డాక్టర్ సుధాకర్, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజేష్ లపైనే కాదు దళిత రాజధాని అమరావతిని నాశనం చేసేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. న్యాయాస్థానం కూడా తీవ్రంగా స్పందించింది. సుధాకర్ విషయంలో వచ్చిన అప్రతిష్టను తొలగించుకునేందుకు, కేసు నుంచి బయటపడేందుకు  వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'' అన్నారు. 

''జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని దళిత మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. కేబినెట్ లోని  దళిత మంత్రి సుధాకర్ తల్లికి ఫోన్ చేసి కేసును విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ డాక్టర్ సుధాకర్ ను, దళితులను వేధింపులకు గురి చేసిన జగన్ కు కాళ్లు మొక్కతూ ద్రోహులుగా మిగలకండి. సుధాకర్ తల్లి దగ్గరకు వెళ్లిన మంత్రి అన్నం తింటున్నారో, గడ్డి తింటున్నారో అర్ధం కావడంలేదు. సుధాకర్ కు న్యాయం చేయకపోగా అన్యాయం చేయాలని చూస్తే దళిత జాతి చూస్తూ ఊరుకోదు'' అని మండిపడ్డారు. 

read more  జగన్ ప్రభుత్వానికి హైకోర్టు చెంపదెబ్బ... విశాఖ పోలీసులపైనే కేసులు: అఖిలప్రియ

''లొంగి బానిసలుగా బతకడంకంటే పోరాడి ప్రాణాలు పోయినా పర్లేదని సుధాకర్ నిరూపించారు. ఆయనకు దళితుల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. బెదిరించి లొంగతీసుకోవాలని చూసిన మంత్రిని బర్తరఫ్ చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసి తలదించుకుంటోంది. వైసీపీ పాలనలో మానవ హక్కులు హరింపబడుతున్నాయి. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా దళిత రాజధానిని ధ్వంసం చేయలేరు. జగన్ అహంకారం ఎన్నాళ్లో సాగదు. డాక్టర్ సుధాకర్ కు మా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని సుధాకర్ కు న్యాయం చేయాలి'' అని 
కెఎస్. జవహర్ కోరారు.
 

click me!