ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను: మాజీ హోం మంత్రి సుచరిత

Published : Apr 11, 2022, 01:35 PM IST
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను: మాజీ హోం మంత్రి సుచరిత

సారాంశం

ఏపీ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఏపీ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రోజు కార్యకర్తలతో సమావేశమైన సుచరిత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.  క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయవద్దని  కోరారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు. అయితే ఇప్పటికే ఆమెకు మద్దతుగా కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు  రాజీనామా చేశారు. 

ఇక, తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా సుచరిత కూతురు రిషిత నిన్న రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం రాజీనామా చేయలేదని ఆమె వెల్లడించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖపై సంతకం చేసి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావుకు అందజేసినట్లు తెలిపారు.

రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని సీఎం జగన్ ముందే చెప్పారని సుచరిత అన్నారు. మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని... కానీ కొన్ని కారణాలు బాధ కలిగించాయని చెప్పారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రాజకీయాలలో ఉన్నంత కాలంలో జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం