మేకతోటి సుచరిత: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

By Rajesh KarampooriFirst Published Mar 20, 2024, 1:20 PM IST
Highlights

Mekathoti Sucharita Biography: మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే రాజకీయ అరంగరటం చేసినా ఆమె హేమా హేమలను ఎన్నికల్లో ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత వైఎస్ జగన్ ప్రభుత్వం లో హోం శాఖ మంత్రి, విపత్తు నిర్వహణ మంత్రి గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఆమె వ్యక్తిగత , రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం
 

Mekathoti Sucharita Biography:

బాల్యం, విద్యాభ్యాసం: 

మేకతోటి సుచరిత 25 డిసెంబర్ 1972న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జన్మించారు. ఆమె తండ్రి అంకారావు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు. తర్వాత ఫిరంగిపురంలో క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. ఆమె విద్యాభ్యాసం గుంటూర్ లోనే జరిగింది. ఆమె 1990లో పొలిటికల్ సైన్స్‌లో BA పూర్తి చేసింది. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆదాయపు పన్ను (అప్పీల్) కమిషనర్‌గా నియమితులైన ఐఆర్‌ఎస్ అధికారి ఎం దయాసాగర్‌ను వివాహం చేసుకుంది.  

రాజకీయ జీవితం 

సుచరిత 2009 లో తొలిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రత్తిపాడు సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు . 2006లో ఆమె గుంటూరులోని ఫిరంగిపురం నుంచి ZPTC ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2009లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ ఆమెకు పార్టీ టిక్కెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా ఆమె భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ విధంగా తొలిసారి 2003లో అసెంబ్లీ కాలుమోపారు. 2009లో YSR మరణం తరువాత ఆమె YS జగన్ మోహన్ రెడ్డికి విధేయత చూపారు. 2011మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. YSRCP పార్టీ చేరారు.ఈ తరుణంలో 2012 మే లో జరిగిన ఉపఎన్నికలలో ఆమె మళ్ళీ YSRCP టిక్కెట్‌పై అదే స్థానం నుండి పోటీ చేసి.. 16 వేల మెజారిటీతో విజయం సాధించారు. 
 
2014లో తెలుగుదేశం పార్టీ ఆమెకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సిద్ధం అయ్యి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ప్రత్యక్షంగా మీడియా ద్వారా టిడిపి నాయకులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో ఆమెకు ప్రాముఖ్యత కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా హామీ ఇచ్చారు. కానీ ఆమె వైయస్సార్ కుటుంబానికి విధేయతతోనే ఉంది.  తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆఫర్లు చేసినా పార్టీ వీడలేదు. 2014 ఎన్నికల్లో అప్పటి టిడిపి నేత రావుల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు.

ఎన్నికల్లో ఓటమిపాలైన నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎప్పుడూ ఆందోళన చెందలేదు. నిత్యం ప్రతిపాడు ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేశారు.  మళ్ళీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు వైఎస్ఆర్సిపి టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి డొక్కా మాణిక్య ప్రసాద్ పై 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  అనంతరం వైఎస్ జగన్ క్యాబినెట్ లో ఎస్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఏకంగా హోం మంత్రి పదవిని దక్కించుకొని సంచలనంగా మారారు. నవ్యాంధ్రతోలి మహిళా హోం మంత్రిగా చరిత్ర సృష్టించారు సుచరిత. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఆమెపై వైఎస్ జగన్ ఆమెపై నమ్మకం పెట్టుకున్నారు. తాడికొండ నియోజక వర్గం నుంచి మేకతోటి సుచరితను బరిలో దించనున్నారు. 

click me!