చెప్పాడు చేశాడు.. పవన్ కళ్యాణ్.. పై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్.. ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు..

By Mahesh Jujjuri  |  First Published Jun 4, 2024, 3:39 PM IST

పవర్ స్టార్ పవరన్ కళ్యాణ్ విజయంపై పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కు విషెష్ వెల్లుతెతుతున్నాయి. 



పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ ఘన విజయం తో సినిమా ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో కూడా ఆనందం వెల్లి విరుస్తోంది. మెగా ప్యామిలీ నుంచే కాకుండా.. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆయనకు ఎస్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా  సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. మనల్వెవడ్రా ఆపేది.. చేప్పాడు చేశాడు అంటూ.. పవర్ స్టార్ పవర్ ఫుల్ వీడియోను శేర్ చేశారు. 

ఇక సాయి ధరమ్ తేజ్ తో పాటు..  హీరో నితిన్, డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ విజయానికి సంబరాలు చేసుకుంటున్నాం అన్నారు. అంతే కాదు పవర్ ఎప్పుడు అనే డైలాగ్ నే వారు రిపిట్ చేస్తున్నారు మనల్వెవడ్రా ఆపేది అంటూ మారుమోగిస్తున్నారు. మోత్తానికి ఏపీలో కూటమి గట్టిగా కొట్టింది. జనసేన ఈసారి సత్తా చాటుకుని వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంది. 

Latest Videos

 

చెప్పాడు... చేసాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది!!!
💪🏼💪🏼💪🏼 pic.twitter.com/UN57aR0hD4

— Sai Dharam Tej (@IamSaiDharamTej)

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్న మాటలను నిలబెట్టుకున్నాురు. ఎవడ్రా మనల్ని ఆపేది.. బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 

14 వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి పవర్ స్టార్ 70  వేల వరకూ మెజారిటీతో వంగా గీతను ఓడించారు. దాంతో ..ఇక రాష్ట్రం అంతా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 15 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార్ విజయంతో పాటు.. దాదాపు 20సీట్లు సాధిస్తోన్న జనసేనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతే కాదు మెగా ప్యామిలీతో పాటు.. ఇండస్ట్రీలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

click me!