ఎంబీబీఎస్ ఫస్ట్‌క్లాస్‌లో పాస్.. ఆశ్రమంలో కోవిడ్ రోగులకు చికిత్స, మహమ్మారికి బలైన వైద్య విద్యార్ధిని

By Siva KodatiFirst Published Jun 1, 2021, 10:41 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో వైద్య విద్యార్థిని మృతి చెందారు. ఎంబీబీఎస్‌లో ఫస్ట్ క్లాస్ లో పాసైన ఆమె ఏలూరులో వున్న ఆశ్రమంలో కరోనా రోగులకు సేవలు చేస్తోంది

కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు.. మరణాలతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. అటు బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతతో రోగులు నరకయాతన పడుతున్నారు. అయినప్పటికీ వైద్యులు తమ ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు డాక్టర్లు సైతం మహమ్మారి బారినపడి మరణించగా.. పలువురు వైద్యులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read:ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు: భయపెడుతున్న మరణాలు.. ఒక్క ప.గోలోనే 20 మంది మృతి

తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో వైద్య విద్యార్థిని మృతి చెందారు. ఎంబీబీఎస్‌లో ఫస్ట్ క్లాస్ లో పాసైన ఆమె ఏలూరులో వున్న ఆశ్రమంలో కరోనా రోగులకు సేవలు చేస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఆమె కోవిడ్ బారినపడ్డారు. దీంతో స్వగ్రామం మోరి చేరుకున్న ఆమె సోమవారం మోరిలోని సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్‌లో చేరారు. ఈరోజు ఆరోగ్యం విషమించడంతో సుబ్బమ్మ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. వైద్య విద్యార్ధిని మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. 

click me!