ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు: భయపెడుతున్న మరణాలు.. ఒక్క ప.గోలోనే 20 మంది మృతి

Siva Kodati |  
Published : Jun 01, 2021, 06:03 PM IST
ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు: భయపెడుతున్న మరణాలు.. ఒక్క ప.గోలోనే 20 మంది మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 11,303 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 11,303 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,04,388కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,034కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 8, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, చిత్తూరు 14, గుంటూరు 9, కర్నూలు 6, నెల్లూరు 5, కృష్ణ 6, విశాఖపట్నం 7, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 20, ప్రకాశం 4, కడపలో ఐదుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 15,46,617కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 93,704 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,93,50,008కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,46,737 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 953, చిత్తూరు 1536, తూర్పుగోదావరి 2477, గుంటూరు 686, కడప 323, కృష్ణ 647, కర్నూలు 286, నెల్లూరు 444, ప్రకాశం 935, శ్రీకాకుళం 693, విశాఖపట్నం 985, విజయనగరం 222, పశ్చిమ గోదావరిలలో 1116 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu