మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ : వందకోట్ల ఆస్తి ఉందంటూ, అందమైన ఫొటోతో యువతులకు ఎర..బాధితుల్లో ఐటీ ఉద్యోగి, వైద్యురాలూ.

By SumaBala BukkaFirst Published Jan 17, 2023, 12:24 PM IST
Highlights

పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీలో యువతులకు వల వేసి లక్షలు కాజేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

గుంటూరు : మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్లలో అమ్మాయిలు చిక్కుకొని మోసపోతున్న ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. తనకు 100 కోట్ల ఆస్తి ఉందని, అందమైన ఫోటోలతో మ్యాట్రిమోనీలో యువతులకు వలవేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లిపేరుతో యువతులకు వలవేసి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు దోచేసి తరువాత మొహం చాటేస్తున్న కేటుగాడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మోసాలకు పాల్పడిన కేటుగాడు విమానంలో దేశాన్ని దాటిపోయే క్రమంలో  పోలీసు బృందాలు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చొరవతో  అరెస్టు చేశాయి.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. లండన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న గుంటూరుకు చెందిన యువతికి ఆమె తల్లి వివాహ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మ్యాట్రిమోనీలో నమోదు చేసింది. అది చూసిన హైదరాబాదుకు చెందిన ఓ యువకుడు..  తాను కోటీశ్వరుడినని చెప్పి.. తన ఆస్తి, జీతం విషయాలపై తప్పుడు సమాచారం ఇచ్చాడు. తాను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి ఉందని తెలిపాడు. వారితో పరిచయం పెంచుకున్నాడు. పూర్తిగా నమ్మారని నిర్థారించుకున్నాక.. గుంటూరులో వాళ్ళు ఇల్లు కొనుక్కునేందుకు కోటి రూపాయలు పంపుతానని కూడా చెప్పాడు.  

బాబు టికెట్ ఇవ్వకపోతే ఏమీ కాదు, పార్టీలతో పనిలేదు: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలనం

దీనికోసం తమ మధ్య బ్యాంకు లావాదేవీలు జరగాలని నమ్మించాడు. అతడి మాటలు పూర్తిగా నమ్మిన ఆమె అతడు చెప్పినట్టుగానే రూ.25 లక్షలు విడతలవారీగా అతడి అకౌంట్ కు పంపించింది. ఇల్లు కొనే క్రమంలో భాగంగా ఇంటి యజమాని డబ్బులు ఇవ్వమని అడిగాడు.  ఆ విషయాన్ని అతడికి చెప్పగా ఒక్కసారిగా కోటి రూపాయలు ఇవ్వద్దని ముందు తన ఖాతాలోకి రెండు లక్షలు పంపాలని తెలిపాడు. దీంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని గాలించి పట్టుకున్నారు. ఈ కేటుగాడికి ఇది అలవాటేనని వారి విచారణలో తేలింది. 20 రోజుల క్రితం విశాఖలోని ఓ వైద్యురాలిని కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నాడని తేలింది. ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.

click me!