పోలీసు స్టేషన్ లో లుంగీతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..!

By SumaBala BukkaFirst Published Jan 17, 2023, 7:48 AM IST
Highlights

గొర్రెల దొంగతనం కేసులో అరెస్టైన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లోనే ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటనలో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.  

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసు స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లుంగీతో ఉరి వేసుకుని అతను మరణించాడు. గొర్రెల చోరీ కేసులో రామాంజనేయలు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రిపూట అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటనపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్ గా స్పందించారు. సిఐ శ్రీనివాస్ ను, ఇద్దరు కానిస్టేబుళ్లను, ఓ హోంగార్డును సస్పెండ్ చేశారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి భార్య కుటుంబ కలహాలు అనే పద్యంలో ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సిఐడి సిఐ చంద్రశేఖర్  భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విజయవాడ పటమట పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా తెలిపారు. సీఐ చంద్రశేఖర్, ఆయన భార్య జ్యోతి (34), ముగ్గురు పిల్లలు విజయవాడ పటమట తోటవారి వీధిలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.  పిల్లలకు భోజనం పెట్టే విషయంలో మధ్యాహ్నం ఒంటి గంటకి  ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

రంగంపేటలో జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు..

ఆ తర్వాత సిఐ చంద్రశేఖర్ భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు. వాగ్వాదానికి దిగడంతో జ్యోతి మనస్థాపానికి గురైంది. భర్త వెళ్లిపోగానే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ముగ్గురు పిల్లలు ఏదో ప్రమాదాన్ని శంకించి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో వారు గట్టిగా తలుపులు బాధుతూ.. తలుపులు తీయాలంటూ కేకలు వేశారు. అయినా, గదిలోపలున్న జ్యోతి స్పందించలేదు. పిల్లల ముగ్గురు వెంటనే తండ్రి చంద్రశేఖర్ కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. కంగారుపడిన చంద్రశేఖర్ హుటాహుటిన ఇంటికి వచ్చిచూడగా.. భార్య అప్పటికే ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది. విజయవాడ పటమట పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు.

click me!