హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు...

Published : Mar 18, 2023, 08:01 AM ISTUpdated : Mar 18, 2023, 08:21 AM IST
హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు...

సారాంశం

హైదరాబాద్ లోని శాస్త్రిపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసి పడుతున్నాయి. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్థమయ్యాయి. ప్రమాదం కారణంగా చుట్టు పక్కల దట్టంగా పొగ అలుముకుంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాలా పత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారి 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో.. సకాలంలో వారు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలం స్క్రాప్ గోడౌన్ గా గుర్తించారు. అయిదు ఫైరింజన్లతోని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ గోదాం కావడం.. ఎక్కువ మొత్తం స్క్రాప్ ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. దీని చుట్టు పక్కల కూడా ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లు ఉన్నాయి. వీటికి మంటలు అంటుకోకుండా అదుపు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu